మల్లారంలో చలివేంద్రం ప్రారంభం

నవతెలంగాణ – మల్హర్ రావు
వేసవిలో ఎండలు భగభగ మండుతున్న నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చడానికి మండల ఎంపీడీఓ కే. శ్యాంసుందర్ ఆదేశాల మేరకు, మల్లారం గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో గురువారం నూతనంగా చలివేంద్రం ఏర్పాటు చేసినట్లుగా పంచాయతీ కార్యదర్శి చెలుకల రాజు యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడారు వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా, గ్రామ ప్రజల సౌకర్యార్థం ,ప్రయాణికుల కోసం, బస్టాండ్ సమీపంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలు, ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ సుమలత, గ్రామ ప్రజలు,గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.