నవతెలంగాణ నెల్లికుదురు
ప్రభుత్వ జూనియర్ కళాశాల నెల్లికుదురు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మర్సకట్ల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం తెలుగు భాషా దినోత్సవాన్ని, జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా తెలుగు కవి గిడుగు వేంకట రామ్మూర్తి, హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ చిత్రపటాలకు పూలమాల వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్,ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మర్సకట్ల అనిల్ కుమార్ లు మాట్లాడుతూ తెలుగు కవి గిడుగు వేంకట రామ్మూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని, మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటునామని అన్నారు.
గిడుగు వేంకట రామ్మూర్తి తెలుగు సాహిత్యాన్ని సరళీకరించి, తెలుగు తీయదనాన్ని సామాన్యుడికి చేరువ చేసేందుకు ఆయన ఎనలేని కృషి చేశారని, తెలుగు భాషలోనే విద్యా బోధన, ప్రజా పరిపాలన కొనసాగాలని ఉద్యమాలు చేశారని అన్నారు. అలాగే ధ్యాన్ చంద్ క్రీడలో ప్రపంచ అత్యుత్తమ క్రీడాకారుల్లో ఒకడని, గోల్స్ చేయడంలో మంచి ప్రతిభ కనబరిచేవాడని, భారతదేశానికి హాకీలో 1928, 1932, 1936 ఒలంపిక్ క్రీడల్లో వరుసగా బంగారు పతకాలు సాధించి పెట్టి, క్రీడా ప్రపంచంలో భారత దేశానికి వన్నె తెచ్చాడని అన్నారు.
ధ్యాన్ చంద్ ను ఆదర్శంగా తీసుకొని విద్యార్థినీ, విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని అన్నారు. అనంతరం అధ్యాపక బృందం తెలుగు అధ్యాపకుడు దూపటి శ్రీనివాస్ ను, కళాశాల స్పోర్ట్స్ ఇంచార్జ్ ఎనమాల సుధాకర్ ను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకలు ముక్కెర ప్రకాష్ బాబు, బంటు కవిరాజు, భూక్యా నాగేశ్వరావు, పెద్దూరి వెంకటేశ్వర్లు, కక్కెర్ల రామ్మూర్తి, దూపటి శ్రీనివాస్, ఎనమాల సుధాకర్, కందికొండ బాబు, దేశెట్టి యాకన్న, కొత్తా సుభాష్, అధ్యాపకేతర బృందం ప్రదీప్, లక్ష్మణ్, గౌరీ శంకర్, అరుణ, రమ, వెన్నెల, మరియు ఎన్.స్.స్ వాలంటీర్లు పాల్గోన్నారు.