మహిళా సమస్యల నేపథ్యంలో..

ప్రపంచంలో అన్ని వస్తువులు ఈఎంఐలలో దొరుకుతాయి. అలాగే అమ్మాయి కూడా ఈఎంఐలో దొరికితే ఎలా ఉంటుంది అనేదే మా ”ఈఎంఐ ఈ అమ్మాయి. దొంతు బుచ్చయ్య, బమ్మిడి సంగీత సమర్పణలో శ్రీ అవదూత వెంకయ్య స్వామి ప్రొడక్షన్స్‌ పతాకంపై నోయల్‌ సీన్‌, భానుశ్రీ జంటగా దొంతు రమేష్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ డి. రమేష్‌ గౌడ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 10న విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా సమర్పకులు దొంతు బుచ్చయ్య మాట్లాడుతూ, ‘వివిధ దశల్లో అమ్మాయిలు ఎదుర్కొనే రకరకాల సమస్యలను కథాంశంగా తీసుకొని రూపొందించిన చిత్రమిది’ అని తెలిపారు. ‘మా సినిమా విడుదలకు ఈస్ట్‌ వెస్ట్‌ రాజీవ్‌, బుర్రా ప్రశాంత్‌ గౌడ్‌ సపోర్ట్‌ చేస్తున్నారు’ అని దర్శకుడు దొంతు రమేష్‌ చెప్పారు.