మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ డివిజన్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక 

నవతెలంగాణ – అచ్చంపేట:  మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అచ్చంపేట డివిజన్ కమిటీని జిల్లా అధ్యక్షులు దేవరపాక ప్రభాకర్ ఆధ్వర్యంలో మంగళవారం అచ్చంపేటలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా బి.లాలయ్య మాదిగ, ప్రధాన కార్యదర్శిగా తాండ్ర తిరుపతయ్య మాదిగ, కోశాధికారిగా డి బాలస్వామి మాదిగ, వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాజశేఖర్ మాదిగ,  ఉపాధ్యక్షులుగా మహేష్ మాదిగ,  జిలకర మల్లేష్ మాదిగ, సహాయ కార్యదర్శిగా ఆలేటి పీటర్ మాదిగ డివిజన్ కమిటీ ఎన్నుకున్నారు. ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ కు మందకృష్ణ మాదిగ అలుపెరుగని పోరాటం చేస్తున్నారని వారికి మద్దతుగా ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చిన కచ్చితంగా అమలు చేయాలని కమిటీకి జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ సూచించారు. అనంతరం జనవరి 11 న జరగనున్న  మేధావుల సదస్సు వాళ్లు పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర బాధ్యులు ఒగ్గు సుదర్శన్ మాదిగ, ఎం నారాయణ మాదిగ, జిల్లా కమిటీ బాధ్యతలు ఎస్ వెంకటయ్య మాదిగ, తదితరులు పాల్గొన్నారు.