నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
‘కాంగ్రెస్ నేతలు మీడియా ముందుకొచ్చి మాట్లాడం కాదు… ప్రజల కోసం రోడ్డెక్కి పోరాడాలి’ అంటూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ పార్టీ సీనియర్లకు హితవు పలికారు. కాంగ్రెస్ కొత్త వారికి అధ్యక్ష పదవి ఇవ్వడం ఇప్పుడు కొత్తేమీ కాదనీ, అనేక రాష్ట్రాల్లో ఇచ్చిందని తెలిపారు. అధ్యక్ష పదవి ఇచ్చిన వారిలో ఎంతో మంది నేతలు ముఖ్యమంత్రులయ్యారని గుర్తు చేశారు. పార్టీలో సీనియర్లు, జూనియర్లు అనే తేడా ఉండదనీ, పార్టీ కోసం కష్టపడే వారే ముఖ్యమని చెప్పారు. పార్టీలో అంతర్గతంగా చర్చించుకోవాల నేతలకు సూచించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లపై ప్రజల్లో వ్యతిరేకత ఉందనీ, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.