ముందస్తు అరెస్టులకు అదిరేది లేదు బెదిరేది లేదు.. 

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని 30 గ్రామ పంచాయతీల మాజీ సర్పంచులు  సోమవారం నాడు హైదరాబాద్ అసెంబ్లీ  ముట్టడికి నేడు వెళ్తున్న క్రమంలో ముందస్తుగా కొంతమంది ముఖ్య మాజీ సర్పంచులు పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మండలంలోని బస్వాపూర్  మాజీ సర్పంచ్ ను అరెస్టు చేసి జుక్కల్ పీఎస్ కు తరలించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ రవి పటేల్ మాట్లాడుతూ ఇటువంటి అరెస్టులు మాకు ఏమీ కొత్త కాదని, అరెస్టులకు అదిరేది లేదని బెదిరేది లేదని , ముందుగా గతంలో మేము సర్పంచులుగా పని చేసినప్పుడు పాత బిల్లులు వచ్చే వాటిని ముందుగా విడుదల చేయాలని లేకుంటే కచ్చితంగా అసెంబ్లీ ముట్టడి కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. ఇటువంటి అరెస్టులు ఎన్ని చేసినా రాష్ట్ర, జిల్లా , డివిజన్ , గ్రామాల సర్పంచ్ ల సంఘం, భయపడదని మా డబ్బులు మాకు ఇచ్చేస్తే మేమెందుకు రోడ్లమీద వస్తామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి సర్పంచిగా బాధలను అర్థం చేసుకొని పాత బిల్లులను విడుదల చేయాలని కోరారు.