మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

నవతెలంగాణ -తాడ్వాయి
మండలంలోని ఇటీవలో మృతి చెందిన బీరెల్లి-కామారం గ్రామానికి చెందిన వల్లెపు నరసయ్య కుటుంబానికి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆదేశాల మేరకు బీరెల్లి పిఎసిఎస్ డైరెక్టర్ భాషబోయిన రమేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ బీరెల్లి గ్రామ కమిటీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు ఆలెం సాంబశివరావు లు 50 కిలోల బియ్యం, నగదు అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ వల్లెపు నరసయ్య మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.