మెస్‌ చార్జీలు, స్కాలర్‌ షిప్‌లను పెంచాలి

–   ఎంపీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్‌ కృష్ణయ్య
–  బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో తెలుగు సంక్షేమ భవన్‌ ముట్టడి
నవతెలంగాణ-మెహిదీపట్నం
పెరిగిన ధరలకనుగుణంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యా ర్థుల మెస్‌ చార్జీలు స్కాలర్‌ షిప్‌లను పెంచాలని రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్‌ కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. సోమవారం బీసీ విద్యార్థి సంఘం నాయకులు అంజి, నీలా వెంకటేష్‌, రామకష్ణల నాయకత్వంలో వందలాది విద్యార్థులు మాసబ్‌ ట్యాంక్‌లోని తెలుగు సంక్షేమ భవన్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా ధర్నాకు హాజరైన ఆర్‌ కష్ణయ్య మాట్లాడుతూ ఐదు సంవ త్సరాల క్రితం నాటి ధరల ప్రకారం నిర్ణయించిన మెస్‌ చార్జీలు, స్కాలర్‌ షిప్‌లను ప్రభుత్వం నేటికీ కొనసాగిం చడం దురదృష్టకరమన్నారు. ఇటీవల కాలంలో అన్ని నిత్యవసర వస్తువుల ధరలు మూడు రేట్లు పెరిగాయని కానీ ప్రభుత్వం పాత మెస్‌ ఛార్జీలే ఇవ్వడంతో హాస్టల్‌, గురుకుల పాఠశాల విద్యార్థులకు నాసిరకం ఆహారం పెడుతున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు పూర్తి ఫీజు చెల్లిస్తున్న ప్రభుత్వం.. బీసీ విద్యార్థులకు మాత్రం చెల్లించకపోవడం తీవ్ర అన్యాయం అన్నారు. బీసీలు ప్రభుత్వానికి పనులు కట్టడం లేదా అని ప్రశ్నించారు. బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్‌ చెల్లిస్తే ప్రభుత్వా నికి రూ. 150 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు కాదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా విద్యార్థుల మెస్‌ చార్జీలను, స్కాలర్‌ షిప్‌లను పెంచాలని, అలాగే ఇంజనీరింగ్‌ పీజీ తదితర కోర్సులు చదివే బీసీ విద్యార్థుల పూర్తి ఫీజు ప్రభుత్వమే భరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేనిచో బీసీ సంక్షేమ సంఘం నాయకత్వంలో ప్రభుత్వంపై పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ ధర్నాలో బీసీ నాయకులు అనంతయ్య, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.