యూనిక్‌ పాయింట్‌తో శర్వా 35వ చిత్రం

‘ఒకే ఒక జీవితం’ తర్వాత శర్వానంద్‌ ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఆయన నటిస్తున్న 35వ చిత్రం కావడం విశేషం. ఒక యూనిక్‌ పాయింట్‌తో ఫ్యూచరిస్టిక్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని శ్రీరామ్‌ ఆదిత్య స్టైలిష్‌ సిల్వర్‌ స్క్రీన్‌పై ప్రజెంట్‌ చేయబోతున్నారు. అలాగే బెస్ట్‌ లుక్‌లో శర్వానంద్‌ను చూపించేందుకు ప్రయత్నమూ చేస్తున్నారు. సోమవారం శర్వానంద్‌ బర్త్‌ సందర్భంగా న్యూస్‌ పేపర్‌ యాడ్‌లా రూపొందించబడిన పోస్టర్‌ని మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో శర్వా ఫంకీ, స్లీక్‌, ఎలిగెంట్‌గా కనిపిస్తున్నారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్‌ కాంబినేషన్‌. ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మిస్తుండగా, వివేక్‌ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కొనసాగుతోంది. పోస్టర్‌లో చూపిన కోఆర్డినేషన్స్‌ లండన్‌ను లొకేషన్‌గా సూచిస్తున్నాయి. సినిమాలో శర్వానంద్‌ క్యారెక్టర్‌ ఎంత క్రేజీగా ఉండబోతుందో పోస్టర్‌ కూడా స్పష్టం చేస్తోంది. ఈ పాత్రకు మేకోవర్‌ జస్ట్‌ వావ్‌ అనిపిస్తోంది. క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి అత్యంత ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: శ్రీరామ్‌ ఆదిత్య, సంగీతం: హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌, డీవోపీ: విష్ణు శర్మ, ఎడిటర్‌: ప్రవీణ్‌ పూడి, ఆర్ట్‌: జానీ షేక్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కతి ప్రసాద్‌, ఫణి కె వర్మ