రన్నింగ్ వాకింగ్ తో మన జీవన శైలిలో మార్పులు

– విజయవంతంగా హాఫ్ మారథాన్
– సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత
-హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్  
రన్నింగ్ వాకింగ్ తో మన జీవన శైలిలో మార్పులు వస్తాయని, వాకింగ్ రన్నింగ్ కు వయస్సుతో పనిలేదని సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేతా రెడ్డి, హుస్నాబాద్ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ అన్నారు. ఆదివారం హుస్నాబాద్ లో హుస్నాబాద్ పోలీస్ శాఖ, రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన హాఫ్ మారథన్ రన్ ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యాయామం శారీరక దారుఢ్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు. హుస్నాబాద్ యువతీ యువకులు చైతన్య నింపేలా మూడవ ఎడిషన్ ఆఫ్ మారథాన్ రన్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. యువతీ యువకులు మహిళలు పురుషులు ప్రతిరోజూ వాకింగ్ రన్నింగ్ చేస్తూ ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందాలన్నారు. ప్రతి ఒక్కరు రన్నింగ్ వాకింగ్ అలవాటు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్క విద్యార్థినీ విద్యార్థులు రన్ పోటీలలో పాల్గొని, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
 విజయవంతంగా హాఫ్ మారథాన్
హుస్నాబాద్ లో చేపట్టిన హాఫ్ మారథన్ రన్ లో 1800 మందికి పైగా యువతీ యువకులు పాల్గొన్నారు. హుస్నాబాద్ పట్టణంలో 5 కే రన్, 10 కే, 21కే రన్ అక్కన్నపేట వరకు కొనసాగింది. హాఫ్ మారథాన్ రన్ లో  సిద్దిపేట సిపి శ్వేతా రెడ్డి  పాల్గొని పూర్తి చేశారు.  వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు, ప్రజా ప్రతినిధులు రన్నర్ లను ఉత్సాహపరిచారు. వందలాదిమంది యువతీ యువకులు రన్నింగులో పాల్గొనడంతో ఆఫ్ మారుథాన్ రన్ విజయవంతంగా ముగిసింది.
 విజేతలకు బహుమతులు అందజేత
21 కె రన్నింగ్ లో ప్రథమ రమావత్ రమేష్ చంద్ర, ద్వితీయ బొడ్డుపల్లి రమేష్, తృతీయ మజ్జి వేదవ్యాస్
21 కె మహిళల విభాగంలో ప్రథమ వడ్డె నవ్య, ద్వితీయ జి మహేశ్వరి, తృతీయ పి కామాక్షి,
10 కె ప్రథమ మంచి కంటి లింగన్న, ద్వితీయ రాథోడ్ అనిల్, తృతీయ కరెంటోత్ అనిల్,
10 కె మహిళల విభాగంలో ప్రథమ మర్పల్లి ఉమ, ద్వితీయ ఎండి. సమీరా బేగం,తృతీయ పాయం కుమారి, 5 కె లో ప్రథమ మహమ్మద్ రఫీ, ద్వితీయ అభిషేక్, తృతీయ కే అనిల్
మహిళల విభాగంలో 5 కె రన్ లో ప్రథమ బహుమతి ఎం.విశాలాక్షి,ద్వితీయ డి. కళ్యాణి, తృతీయ బానోతు హరిత లకు సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేతా రెడ్డి, ఎమ్మెల్యే సతీష్ కుమార్ నగదు బహుమతులతో పాటు ప్రశంస పత్రం, మెడల్స్ అందజేశారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి అడ్మిన్ మహేందర్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత, హుస్నాబాద్ ఏసీపి సతీష్, సీఐ కిరణ్,ఎస్బి ఇన్స్పెక్టర్ రఘుపతి రెడ్డి, ఎస్ఐ మహేష్ కుమార్, అక్కన్నపేట ఎస్ఐ వివేక్, కోహెడ ఎస్ఐ నరేందర్ రెడ్డి, అక్కన్నపేట జెడ్పిటిసి భూక్య మంగ, ఎంపీపీ లక్ష్మి,హుస్నాబాద్ రన్నర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అమ్మి గల రమేష్, ఉపాధ్యక్షులు బొడుమల్ల సంపత్ సెక్రెటరీ మహేందర్ శ్రీనివాస్, తిరుపతి, వెంకట్ నర్సయ్య, సిద్దిపేట ఏసిపి దేవా రెడ్డి, స్థానిక కౌన్సిలర్ లు సర్పంచులు ప్రజా ప్రతినిధులు యువతీ యువకులు పాల్గొన్నారు.