రాజ్యాంగం సమానమంటుంది

– కుల వ్యవస్థ కాదంటుంది
– మతం పేరుతో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్న బీజేపీ, ఆరెస్సెస్‌ : బీహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌
పాట్నా: హిందూ మతంలో కుల వ్యవస్థను ఆర్జేడీ అగ్రనేత, బీహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ విమర్శించారు. భారత రాజ్యాంగం అందరినీ సమానమని చెప్తుందనీ, కుల వ్యవస్థ అలా కాదని అన్నారు. అందరూ హిందువులే అయినపుడు కొన్ని కులాలు ఎందుకు, ఎలా ”ఎక్కువ”? ఇతర కులాలు ”తక్కువ” అని ఆయన ప్రశ్నించారు. బీహార్‌ లెనిన్‌గా ప్రసిద్ధి గాంచిన చారిత్రక బీసీ ప్రముఖుడు జగదేవ్‌ ప్రసాద్‌ జన్మ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రామచరితమానస్‌ అనే హిందూ ఇతిహాసం ద్వేషాన్ని వ్యాప్తి చేస్తుందని బీహార్‌ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్‌ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ, హిందూత్వ శక్తులు వ్యతిరేకతను వ్యక్తం చేశాయి. దీంతో ఇప్పుడు తేజస్వీ యాదవ్‌ హిందూ మతంలో కుల వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ” కుల వ్యవస్థ కింద కొందరు ప్రజలను ఎక్కువ కులం కేటగిరీలో, చాలా మందిని తక్కువ కులం విభాగంలోకి తీసుకొచ్చారు.