రాష్ట్రంలో హెచ్‌డీఎఫ్‌సీ 25 శాఖలకు విస్తరణ

హైదరాబాద్‌ : ప్రముఖ గృహ రుణాల జారీ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ రాష్ట్రంలో 25 శాఖలకు విస్తరించినట్టు ప్రకటించింది. కొత్తగా కామారెడ్డిలో కార్యాలయం ప్రారంభించడం ద్వారా తెలంగాణలో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకున్నట్లయ్యిందని పేర్కొంది. దీన్ని ఆ సంస్థ సీనియర్‌ అధికారుల సమక్షంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రీజినల్‌ బిజినెస్‌ హెడ్‌ రాజన్‌ టాండన్‌ ప్రారంభించారని తెలిపింది. ఈ కొత్త కార్యాలయం చుట్టుపక్కల ప్రాంతాల వారు తమ కలల ఇంటిని సొంతం చేసుకోడానికి అత్యంత అనుకూలంగా ఉంటుందని తెలిపింది.