రేపు కంటివెలుగు శిబిరాలకు విరామం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 8వ తేదీన (బుధవారం) రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు వైద్య శిబిరాలకు విరామం ప్రకటించారు. మహిళా వైద్య సిబ్బంది సంబరాలు చేసుకునేందుకు వీలుగా వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది.