రేవంత్‌రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు

నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
మహబూబాబాద్‌ కోర్టు సెంటర్లో ఈ నెల 8న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌పై అనుచి త వ్యాఖ్యలు చేశారంటూ గూడూరు మండలం ఏపూరి గ్రామానికి చెందిన బానోతు రామన్ననాయక్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహబూబాబాద్‌ టౌన్‌ పోలీసు లు రేవంత్‌పై ఎస్సీ ఎస్టీ అట్రా సిటీ కేసు నమోదు చేశారు. రామన్ననాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హాత్‌సేహాత్‌ జోడో యాత్రలో భాగంగా ఎమ్మెల్యే బానోత్‌ శంక ర్‌నాయక్‌ను కీచకుడు, హంతకుడు దుశ్శా సనుడు అని దూషించినందుకు రేవంత్‌ రెడ్డిపై ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.కౌన్సి లర్‌ భానోత్‌ రవిని హత్య చేయించాడని నిరాధారమైన ఆరోపణ చేశా రన్నారు. శంకర్‌నాయక్‌ అనుచరులను కాంగ్రెస్‌ కార్యకర్తలతో తొక్కి చంపిస్తానని బెదిరిం చారని తెలిపారు. రేవంత్‌ రెడ్డిపై కేసు న మోదు కావడం మానుకోట లో చర్చనీ యాంశమైంది.