– ఒకదానికొకటి ఢకొీన్న కాన్వరులోని 6వాహనాలు
నవతెలంగాణ – గంభీరావుపేట
రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరుగుతున్న టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్రలో శనివారం ప్రమాదం జరిగింది. ఆయన కాన్వారులోని వాహనాలు ఒకదానికొకటి ఢకొీన్నాయి. వాటిల్లో ప్రయాణిస్తున్న పలువురు నాయకులు, విలేకరులకు స్వల్ప గాయా లయ్యాయి. గంభీరావుపేట మండలంలోని సముద్రలింగపూర్ గ్రామ శివారులో ప్రాంతంలో 9వ ప్యాకేజీ కెనాల్ పనులను రేవంత్ రెడ్డి పరిశీలించడానికి వెళుతున్న క్రమంలో కాన్వారులో వేగంగా ముందు వెళుతున్న వాహనం డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో వెనుక ఉన్న వాహనాలు ఒకదానికొకటి ఢకొీట్టాయి. ఇందులో రేవంత్ రెడ్డికి సంబంధించిన నాలుగు వాహనాలు, న్యూస్ చానళ్లకు చెందిన రెండు వాహనాలు ఉన్నాయి. ఈ ప్రమాదంలో కారులో బెలూన్ ఓపెన్ కావడంతో ప్రయాణిస్తున్నవారు స్వల్ప గాయాలయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.