నవతెలంగాణ-గోవిందరావుపేట
వీర వనితలు మేడారం సమ్మక్క సారలమ్మన ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రథసారథి రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్రను జయప్రదం చేయాలని పిఎసిఎస్ చైర్మన్ పన్నాల ఎల్లారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని కర్లపల్లి లక్ష్మీపురం అమృతండా మొద్దులగూడెం గ్రామాల్లో కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సీతారాం నాయక్ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. ప్రస్తుత పాలక పార్టీకి నూకలు చెల్లిపోయాయని అన్నారు. రేవంత్ రెడ్డి సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ నూతన జవసత్వాలను నింపుకొని ఎన్నికల్లో ఢీకొనేందుకు సిద్ధంగా ఉందని అన్నారు.
పాలక పార్టీల అవినీతిని ప్రజా వ్యతిరేక విధానాలను పాదయాత్రలో ఎండబెట్టడం ఖాయమని ఈ పాదయాత్రను జయప్రదం చేసేందుకు పార్టీ నాయకులు కార్యకర్తలు పూర్తిస్థాయిలో కార్యోన్ముఖులు కవాలని అన్నారు. సాధారణ సర్పంచ్ స్థాయిలో ఉండి రాష్ట్రస్థాయి ముఖ్య నాయకుడినీ విమర్శించలేమన్న ఇంగిత జ్ఞానం లేకపోవడం దురదృష్టకరం అన్నారు. ఇకనైనా స్థాయికి దగ్గ వారిపై మాత్రమే విమర్శ చేస్తే మంచిదని అన్నారు. రాజకీయ విలువలు తెలుసుకొని విమర్శలు చేయాలని సూచించారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర అధికార పార్టీ నాయకుల్లో వణుకు పుట్టిస్తోందని అన్నారు. పాదయాత్ర పూర్తి అయ్యేవరకు ప్రతి కార్యకర్త నాయకుడు పూర్తిస్థాయిలో శక్తివంచన లేకుండా కృషిచేసి పాదయాత్రను జయప్రదం చేయడంలో పాత్ర దారులు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్.సి.సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్, కుర్సం కన్నయ్య, చింత క్రాంతి, బద్దం లింగారెడ్డి, కాడబోయిన రవి, తండా రవి, బర్ల సమ్మిరెడ్డి, బర్ల కిరణ్, గాంధర్ల బాబు, బాలరాజు, రతన్, లక్ష్మీనారాయణ, తండా కృష్ణ తదితర నాయకులు పాల్గొన్నారు.