రైఫిల్‌ ఇప్పించండి సారూ…

– గురి తప్పిన జాతీయ ట్రయల్స్‌,
– షూటర్‌ మారియాకు అవస్థలు
– గురుకులం నుంచి జాతీయ స్థాయికి చేరిన వైనం
– ఆమె ఖాతాలో అనేక పతకాలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
జాతీయ ట్రయల్స్‌లో పాల్గొనే అర్హత సాధించాలంటే ఆషామాషి కాదు.. మొదట జిల్లా స్థాయిలో.. తదుపరి రాష్ట్ర స్థాయి ఆ తర్వాత జాతీయ స్థాయిలో అర్హత పాయింట్లు సాధిస్తూనే, జాతీయ జట్టు కోసం నిర్వహించే ట్రయల్స్‌లో పాల్గొనే అవకాశం దక్కుతుంది. ఇలాంటి అవకాశం కోసం రైఫిల్‌ షూటింగ్‌ క్రీడాకారులు ఏండ్ల కొద్దీ సాధన చేసి ఒక్కొక్క క్రీడాకారుడు నాలుగు నుంచి ఆరు సార్లు జాతీయ పోటీల్లో పాల్గొని అర్హత సాధించిన సందర్భాలు ఎన్నో. అలాంటి పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్న తెలంగాణ బిడ్డ రైఫిల్‌ షూటర్‌ మారియా గురుకులం నుంచి జాతీయ స్థాయికి ఎదిగింది. ఇప్పటి వరకు సెకండ్‌ హ్యాండ్‌ రైఫిల్‌తోనే నెట్టుకొచ్చినా.. ఇకపై అది సరిలేక జాతీయ స్థాయి ట్రయల్స్‌లోనే పాల్గొనే అవకాశం కోల్పోయింది. తెలంగాణ రైఫిల్‌ షూటర్‌ మారియా తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలో 2018లో తన రైఫిల్‌ షూటింగ్‌ ప్రస్థానం మొదలుపెట్టి.. జిల్లా స్థాయిలో బంగారు పతకం, రాష్ట్ర స్థాయిలో వెండి పతకం సాధించింది. 2019లో భోపాల్‌లో జరిగిన 63వ జాతీయ పోటీలలో అడుగుపెట్టిన మారియా, జాతీయ స్థాయి 508వ ర్యాంక్‌లో నిలిచింది. అంచెలంచెలుగా తన శిక్షణను మెరుగుపరచుకుంటూ, 2021లో ఢిల్లీలో జరిగిన 64వ జాతీయ రైఫిల్‌ షూటింగ్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీలలో 286వ ర్యాంక్‌ సాధించింది. మారియా ప్రతిభను ప్రోత్సహించిన తండ్రి ఖదీర్‌ ఉత్తమ శిక్షణ కోసం పూణేలోని బాలివాడి శిక్షణా కేంద్రంలో చేర్పించారు. 2022 సెప్టెంబర్‌లో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన ఇండియన్‌ పబ్లిక్‌ స్కూల్స్‌ ఛాంపియన్‌ షిప్‌(ఐపీఎస్‌సీ) పోటీల్లో వ్యక్తిగత రజత పతకం, టీమ్‌ బంగారు పతకం సాధించింది. 2022 డిసెంబర్‌, కేరళలోని తిరువనంతపురంలో జరిగిన 65వ జాతీయ రైఫిల్‌ షూటింగ్‌ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో జాతీయ స్థాయి 116వ ర్యాంక్‌ సాధించిన మారియా జనవరి 16వ తేదీ నుంచి మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరగనున్న ట్రయల్స్‌లో పాల్గొనే అర్హత సాధించింది, కానీ తన రైఫిల్‌ తరచూ మొరాయిస్తూ సహకరించనందున ట్రయల్స్‌ స్థాయి పోటీలకు ఆడలేక పోతున్నానని అంటోంది మారియా. మారియా తండ్రి ఖదీర్‌ ప్రయివేటు ఉపాధ్యా యుడు. నేటి వరకు ఎవరి ఆర్థిక సహాయ సహకారం లేకుండానే నెట్టుకొస్తున్నారు. మారియాకు సెకండ్‌ హ్యాండ్‌ రైఫిల్‌ షూటింగ్‌ కిట్‌, ప్రతి నెలా పదిహేను రోజులు పూణేలోని బాలివాడి శిక్షణా కేంద్రంలో ప్రముఖ శిక్షకులు సుందర్‌ ఘాటే వద్ద శిక్షణ, ఫిజియో, మొదలగు సౌకర్యాలు కల్పించి మూడుసార్లు జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించారు.  కానీ కరోనా తదుపరి ఉదరంలో హెర్నియా శస్త్రచికిత్స కారణంగా ఆర్థిక పరిస్థితులు బాగా దెబ్బతిన్నందున, మారియాకు శిక్షణ, కొత్త రైఫిల్‌ కొనలేక పోయాననీ తండ్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి విన్నపం ద్వారా అభ్యర్థించాననీ, ప్రభుత్వం సహకరిస్తే మారియా జాతీయ జట్టులో స్థానం దక్కించుకుని, దేశం కోసం ఆడుతుందని ఖదీర్‌ వేడుకుంటున్నారు.

Spread the love
Latest updates news (2024-07-02 09:51):

blood sugar 140 two hours Gfh after eating | blood sugar for c6A 52 year old man | decaf coffee raise 2P1 blood sugar | on keto QJS blood sugar going up | low blood sugar VUi what causes it | sugar blood big sale rango | blood sugar eJO level 180 after eating | post lunch blood sugar level 98 Bco | normal blood sugar reading 8Oa after fasting 12 hours | what happens if your blood suger is bT8 400 | post lunch blood sugar AMj test procedure | can addison disease cause UXP low blood sugar | is 86 okay for non fasting blood sugar bxN | does vistaril affect blood zol sugar | how do i add blood sugar 1xu reading in lose it | blood sugar trick destroys bEq diabetes | fasting blood 9n3 sugar level 92 mg dl | oMB post prandial blood sugar level during pregnancy | blood sugar with 5dR gestational diabetes | best AOT device for testing blood sugar | drugs OxW that can cause high blood sugar levels | best foods to xH5 keep blood sugar up | free blood sugar wx9 chart template | instant low blood sugar after IiK eating | blood sugar 80 mmol NQB | what zHe blood sugar level will put you in a coma | blood sugar 2BI 190 during pregnancy | diabetics always know when TOO their blood sugar is low | going from high blood sugar to normal symptoms VgD | confusion and high blood yiL sugar | 151 blood OOc sugar pregnancy | FOq low blood sugar causing hallucinations | is there any way to lower blood nW4 sugar quickly | which foods lower blood UJp sugar quickly | if your blood sugar IYz is high would it cause dizziness | type kTK 2 diabetes need chart of blood sugar levels | 10 health warning nkq signs of low blood sugar | green tea w2H for blood sugar | normal blood 3c1 sugar after meal mmol | is X84 high blood pressure caused by sugar | effects of ice cream bwH on blood sugar diabetes | how often should i check Nd5 my cat blood sugar | can ginger lower 4hb blood sugar levels | what should fJH a pregnant woman blood sugar level be | blood STd sugar that is too low | emergency home treatment for OYY high blood sugar | what shpuld your JbL blood sugar and a1c be | how to lower UWy diabetes blood sugar | blood sugar in the Kmc morning for non diabetic | blood sugar MM6 level 142 after fasting