వాస్తవం కోసం గతం చేసిన యుద్ధం

వివివి ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎం.ఏ.చౌదరి దర్శకత్వంలో కె.కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘వీరఖడ్గం’. చరిత్ర శిథిలమైనా, దాని మూలాలు ఎక్కడో ఒక చోట మిగిలే ఉంటాయి. పగ కూడా అంతే. ఒక మనిషిని నాశనం చేయాలనుకుంటే ఎన్ని జన్మలైన సరే, దాన్ని సాధించే వరకు మనిషి జీవితం మసి అయినా, ఆ శవమే మగమై వెంటాడుతుంది. వాస్తవాన్ని వెంటాడుతూ గతం చేసిన యుద్ధమే ఈ ‘వీరఖడ్గం’ సినిమా అని మేకర్స్‌ తెలిపారు.
లైన్‌ ప్రొడ్యూసర్‌ మారిశెట్టి సునీల్‌ కుమార్‌ మాట్లాడుతూ, ‘సినిమా అద్భుతంగా వచ్చిందని ప్రీమియర్‌ చూసిన సినీ ప్రముఖులు ప్రశంసించారు. ఎమ్‌.ఏ చౌదరి స్క్రీన్‌ ప్లే, డైరెక్షన్‌ ఈ చిత్రాన్ని ఇంకో స్థాయికి తీసుకెళ్లాయి. రైటర్‌ ఘటికాచలం మాటలు, షయాక్‌ పార్వాజ్‌ స్వరాలు, నందు, దేవరాజ్‌ మాస్టర్‌ పోరాటాలు అద్భుతంగా వచ్చాయి. మార్చి మొదటి వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’ అని చెప్పారు.