విదేశాల్లో నర్సింగ్‌ ఉద్యోగాలు

– వర్క్‌షాప్‌ ప్రారంభించిన రాణి కుముదిని
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆరోగ్య రంగంలో విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని అన్నారు. బుధవారంనాడామె గాంధీ ఆస్పత్రిలో వర్క్‌షాప్‌ ప్రారంభించారు. యూఎస్‌ఏ, కెనడా, జపాన్‌, ఆస్ట్రేలియా, యూకే, జర్మనీ తదితర యూరోపియన్‌ దేశాల్లో నర్సింగ్‌ ఉద్యోగాలకు డిమాండ్‌ ఉందన్నారు. ఈ సందర్భంగా 403 మంది నర్సింగ్‌ విద్యార్థులకు స్క్రీనింగ్‌ పరీక్ష నిర్వహించారు.