విద్యారంగాన్ని విస్మరించిన కేంద్ర బడ్జెట్..

– ఎఐఎస్ఎఫ్ అధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం
– తెలంగాణ కి విద్యాసంస్థలను కేటాయించకుండా వివక్ష చూపిస్తున్న మోడీ ప్రభుత్వం
నవతెలంగాణ-డిచ్ పల్లి
కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా  విద్యారంగాన్ని విస్మరించిందని, ఈ బడ్జెట్ కేవలం పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రవేశపట్టిన  ఎన్నికల బడ్జెట్ తప్ప విద్యార్థులకు యువకులకు ఈ బడ్జెట్ ద్వారా ఏమీ ప్రయోజనం లేదని బడ్జెట్లో విద్యకు 10% శాతం నిధులు కేటాయించాలని, కొఠారి  కమిషన్ చెప్పిన మోడీ ప్రభుత్వం విద్యారంగం పట్ల చిన్న చూపు చూస్తూ కనీసం 5% శాతం నిధులు కూడా కేటాయించలేదని కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి బడ్జెట్ లో విద్యకు నిధులు తగ్గిస్తు కార్పొరేట్ కంపెనీలకు దోచి పెడుతుందని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి దినేష్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ తిరును నిరసిస్తూ గురువారం మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టి బోమ్మను దగ్దం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన నాటి నుండి బడ్జెట్ లో విద్యకు నిధులు తగ్గిస్తు కార్పొరేట్ కంపెనీలకు దోచి పెడుతుందని   డిజిటల్ విద్య, డిజిటల్ లైబ్రరీ  ప్రాధాన్యత అంటున్న మోడీ ప్రభుత్వం పేద వారికి విద్యను దూరం చేసి విద్యను మొత్తం ప్రయివేటీకరణ చేసే కుట్ర చేస్తున్నదని ఈ బడ్జెట్ లో విద్యార్థుల సంబంధించిన స్టేషనరి వస్తువులపై  జీఎస్టీ ఎత్తివేయడం కానీ, కనీసం తగ్గించడం కానీ లేదని,  ముఖ్యంగా తెలంగాణ విభజన హామీల్లో ఉన్న  కరీంనగర్ లో  ట్రిపుల్ ఐటీ ఏర్పాటు లేదని జిల్లాలో సైనిక స్కూల్ ఏర్పాటు కే పరిమితం అయినదని, జిల్లాకో నవోదయ పాఠశాలల ఏర్పాటు, కేంద్రీయ విద్యాలయల ఏర్పాటు, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ఈ బడ్జెట్ లో అయిన వస్తాయి అనుకుంటే ఈ బడ్జెట్ లో మొండి చేయి చూపించిందని, యూనివర్సిటీ లను నిర్వీర్యం చేస్తూ ప్రయివేట్, విదేశీ యూనివర్సిటీలకు ప్రాధాన్యం  ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని వివరించారు.
పూర్తిగా విద్యార్థి వ్యతిరేక బడ్జెట్ అని తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల పట్ల  తెలంగాణ విభజన హామీల్లో ఉన్న విద్యాసంస్థలను తెలంగాణ కి కేటాయించకుండా మోడీ ప్రభుత్వం కక్ష్య చూపిస్తుందనీ మోడీ ప్రభుత్వ విద్యార్థి వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు సుమన్, మహేష్, మనోజ్, హరిష్, గౌతమ్, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.