విద్యార్థినిని దండించిన ఉపాధ్యాయురాలు

నవతెలంగాణ- చేవెళ్
విద్యార్థులను దండించొద్దని ప్రభుత్వం ఎన్ని విధాలుగా చెబుతున్నా, కొంతమంది ఉపాధ్యాయులు పెడచెవిన పెడుతున్నారు. చేవెళ్ల మండల కేంద్రంలోని కృష్ణవేణి పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న రామన్నగూడ గ్రామానికి చెందిన అభినయశ్రీకి జ్వరం రావడంతో గత వారం రోజులుగా పాఠశాలకు వెళ్లలేదు. రెండు రోజుల నుంచి పాఠశాలకు వెళ్లడంతో హౌంవర్క్‌ ఎందుకు చేయలేదని ఉపాధ్యాయురాలు సోనీ కర్రతో ఆ విద్యార్ధిని కొట్టింది. దింతో చిన్నారి చేతికి వాతలు వచ్చాయి. ఈ విషయం గుర్తించిన చిన్నారి తల్లిదండ్రులు ఉపాద్యాయురాలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని ఆ విద్యార్థిని తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు.