విద్యార్ధులను అభినందించిన గవర్నర్‌

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
జీ-20 దేశాలకు సంబంధించిన పోటీలకు విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన రావడం పట్ల గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల నుంచి 400మందికి పైగా విద్యార్థులు వివిధ పోటీల్లో పాల్గొన్నారని బుధవారంనాడొక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో వారందరికీ అభినందనలు తెలిపారు. విజేతలకు బహుమతులు అందచేశారు.