విప్రో అనైతిక చర్య

– ‘సగం జీతం’పై ఆందోళనలు
బెంగళూరు : ప్రముఖ ఐటీ సంస్థ విప్రో తమ ఫ్రెషర్స్‌కు తొలుత ఆఫర్‌ చేసిన జీతంలో సగానికి పని చేయాలని కోరడంపై ఆ వర్గాల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. విప్రో చర్య చాలా అనైతికమని ఐటీ సెక్టార్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఎన్‌ఐటీఈఎస్‌ విమర్శించింది. విప్రో నిర్ణయ అన్యాయమనీ, ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. విప్రో తన నిర్ణయంపై మరోసారి పునరాలోచించాలని కోరింది. విప్రో నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తోన్నామని ఎన్‌ఐటీఈఎస్‌ అధ్యక్షుడు హర్పీత్‌ సింగ్‌ సలౌజా పేర్కొన్నారు. తమ సభ్యులకు నష్టం వాటిల్లితే ఊరుకోబో మన్నారు. ఇటీవల విప్రో తన ఫ్రెషర్లకు వేతన ప్యాకేజీని రూ.6.50 లక్షల నుంచి రూ.3.5 లక్షలకు తగ్గించుకుని విధుల్లో చేరాల్సిందిగా కోరినట్టు రిపోర్టులు వచ్చాయి.