శనగ పంట మద్దతు ధర ఉద్యమానికి సిద్ధమవుతున్న రైతన్నలు

– నవతెలంగాణ కథనానికి స్పందన
నవతెలంగాణ-మద్నూర్
మంగళవారం నాడు నవతెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన నవతెలంగాణలో వెలువడిన వార్తకు స్పందించి భారతీయ కిసాన్ సంగ్ మండల అధ్యక్షులు చాట్ల గోపాల్ ఒక పిలుపునిచ్చారు. ఈనెల 8న బుధవారం ఉదయం 10 గంటలకు మండల కేంద్రంలోని మల్లేశ్వర్ మందిరానికి వ్యవసాయ రైతులు తరలిరావాలని కోరారు.
ఈ ప్రత్యేక సమావేశంలో రైతులు పండించిన శనగ పంటకు అలాగే కంది పంటకు ధనియా పంటకు మద్దతు ధర కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు రైతులమంతా బుధవారం తాసిల్దార్ కార్యాలయానికి తరలివెళ్లి తాసిల్దార్ కు వినతి పత్రాన్ని అందజేసి మద్దతు ధర కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. మద్దతు ధర కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కోసం వ్యవసాయ రైతులు పెద్ద సంఖ్యలో ప్రత్యేక సమావేశానికి హాజరు కావాలని కోరారు.