శెట్టి.. మిస్టర్‌ పోలిశెట్టి

భిన్న చిత్రాలకు, వైవిధ్యమైన కాంబినేషన్లకు కేరాఫ్‌గా నిలిచిన యువీ క్రియేషన్స్‌ సంస్థ ఇటీవలో అనుష్క, నవీన్‌ పోలీశెట్టి కలయికలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించి, అందర్నీ సర్‌ప్రైజ్‌ చేసింది. ఈ ప్రకటన తర్వాత పరిశ్రమతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఈ ప్రాజెక్ట్‌పై ఓ రకమైన ఆసక్తి ఏర్పడింది. ఆ ఆసక్తిని రెట్టింపు చేసేలా ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌ టైటిల్‌ను మేకర్స్‌ ఎనౌన్స్‌ చేశారు. అనుష్క, నవీన్‌ పేర్లు కలిసి వచ్చేలా.. చూడగానే ఆకట్టుకునేలా ఈ చిత్రానికి ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ టైటిల్‌కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. చాలా క్యాచీగా ఉండటంతో పాటు కథకు ఈ టైటిల్‌ సరిగ్గా సరిపోయేలా నప్పిందని చిత్ర బృందం చెబుతోంది. ఈ సినిమాలో సిద్ధుపోలిశెట్టి అనే స్టాండప్‌ కమెడియన్‌గా నవీన్‌, అన్విత రవళిశెట్టి అనే చెఫ్‌ పాత్రలో అనుష్క నటించారు. పి.మహేష్‌ బాబు దర్శకత్వం వహించిన ఈ వైవిధ్యభరిత చిత్రాన్ని వేసవికి తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదలకు చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.