సచివాలయంలో అగ్నిప్రమాదంపై విచారణ జరపాలి

– వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షులు షర్మిల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సచివాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంపై విచారణ జరిపించాలని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షులు వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనపై కేసు ఎందుకు పెట్టలేదో తెలపాలని పేర్కొన్నారు. నిపుణులతో కూడిన కమిటీ వేసి, ఖర్చు పై ఆడిట్‌ చేయించాలని డిమాండ్‌ చేశారు. మాక్‌ డ్రిల్‌ అంటూ అబద్ధాలు చెప్పి, కప్పిపుచ్చుకునేందుకు చూడటమేంటని ప్రశ్నించారు.