– ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
నవతెలంగాణ-అంబర్‌పేట
త్వరలోనే సత్య నగర్‌లో నూతన డ్రయినేజీ, సీసీ రోడ్డు పనులు ప్రారంభిస్తానని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. సోమవారం నల్లకుంట డివిజన్ పరిధి లోనీ సత్య నగర్ లో స్థానిక అధికారులతో కలిసి ఎమ్మెల్యే పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసు కున్నారు. వద్ధులను ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షే మాలు, అలాగే పెన్షన్లు వస్తున్నాయా అని అడిగి తెలుసుకు న్నారు. అనంతరం సత్య నగర్ వాసులు దష్టికి తీసుకు వచ్చిన సమస్యల మీద ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటికీ సత్యనగర్‌లో డ్రయినేజీ సమస్య శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా 40 లక్షల రూపాయల వ్యయంతో పనులు చేపడు తున్నట్టు తెలిపారు. కాలనీ వాసులు అడిగినట్టు కమ్యూనిటీ హాల్లో అవసరమైన సదుపా యాలను, షెడ్డు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. అదే విధంగా సొంత ఖర్చుతో పాడైపోయిన బోరు మరమ్మత్తు పనులు చేయిస్తానని తెలిపారు. కొందరు కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు సొంత స్థలం ఉన్న అర్హులైన వారికి ఇండ్లు కట్టుకోవడానికి ప్రభుత్వం ఇవ్వనున్న రూ.3 లక్షల మంజూరు అయ్యేలా చూస్తానని తెలిపారు. అదే విధంగా అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ డీజీఎం సన్యాసిరావు, ఏఈ భావన, జీహెచ్‌ఎంసీ డీఈ సువర్ణ, ఏఈ దివ్య, వర్క్ ఇన్స్పెక్టర్ నరేందర్, టౌన్ ప్లాన్ ఏసీపి సాయిబాబా, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు దిడ్డి రాంబాబు, బస్తీ ప్రెసిడెంట్ రాంచందర్, బస్తీ వాసులు రాజేష్, ప్రతిభ, బిక్షపతి, శోభ, తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్‌లో చేరిన బీజేపీ మహిళా నాయకురాళ్లు
గోల్నాక డివిజన్ కు చెందిన బీజేపీ మహిళ నాయకురాళ్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీ లో చేరారు. ప్రధానంగా బీజేపీ గొర్ల డివిజన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు అనిత, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు కనకమ్మ లతోపాటు మరో 60 మంది బీజేపీ మహిళా నాయకురాళ్లు సోమవారం గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ వీరందరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ఇతర పార్టీల నాయకులు తమ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన నాలుగు సంవత్సరాలలో అంబర్పేట నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివద్ధి చేస్తున్న విషయాన్ని తెలుసుకుంటున్న బీజేపీ నేతలు బీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. మున్ముందు మరిన్ని చేరికలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు పద్మ, దేవలక్ష్మి, అర్చన, సంధ్య, సత్య తదితరులతో పాటు బి.ఆర్.ఎస్ సీనియర్ నాయకుడు బీ.నర్సింగ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.