సమ్మర్‌ స్పెషల్‌గా రిలీజ్‌

ఉపేంద్ర హీరోగా నటిస్తున్న మూవీ ‘కబ్జ’. పాన్‌ ఇండియా రేంజ్‌లో కన్నడ, తెలుగు, హిందీ, మలయాళ, తమిళ భాషల్లో ఈ చిత్రం మార్చి 17న వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్‌ అవుతుంది. ఆర్‌.చంద్రు దర్శక, నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో నిర్మాత ఎన్‌.సుధాకర్‌ రెడ్డి సమర్పకుడిగా, హీరో నితిన్‌ సొంత బ్యానర్స్‌ రుచిరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎన్‌ సినిమాస్‌ పతాకాలపై తెలుగులో రిలీజ్‌ కానుంది. ఈ సినిమా టైటిల్‌ సాంగ్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉపేంద్ర మాట్లాడుతూ, ‘నేను తెలుగు ఇండిస్టీని చూసి నేర్చుకుని, రాసుకుని సినిమాలు చేశాను. మీ అందరి సపోర్ట్‌కి థ్యాంక్స్‌. మార్చి 17న ఇండియానే కాదు.. గ్లోబల్‌ను కబ్జ చేయబోతున్నాం’ అని అన్నారు.