సరికొత్త కాన్సెప్ట్‌

విజయనిర్మల మనవడు శరణ్‌ కుమార్‌ (నరేశ్‌ కజిన్‌ రాజ్‌కుమార్‌ కొడుకు) హీరోగా, శశిధర్‌ చావలి దర్శకత్వంలో తెరకెక్కిన యూత్‌ ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘మిస్టర్‌ కింగ్‌’. హన్విక క్రియేషన్‌ బ్యానర్‌ బి.ఎన్‌.రావు నిర్మించారు. యశ్విక నిష్కల, ఊర్వీ సింగ్‌ కథానాయికలు. ఈ నెల24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించింది. నరేష్‌, నిర్మాత ఎంఎస్‌రాజు ముఖ్య అతిథులుగా ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా శరణ్‌ మాట్లాడుతూ,’ఇందులో నాది చాలా బలమైన పాత్ర. దర్శకుడు చాలా ప్యాషన్‌తో సినిమా చేస్తే, నిర్మాత ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. మణిశర్మ వండర్‌ ఫుల్‌ మ్యూజిక్‌ ఇచ్చారు’ అని తెలిపారు. ‘దర్శకుడు శశి ఎన్విరాన్‌మెంటల్‌ ఏరోప్లేన్స్‌ గురించి ఏడాది పాటు రీసెర్చ్‌ చేసి ఈ కథని చేశారు. సినిమా అద్భుతంగా వచ్చింది’ అని నిర్మాత బిన్‌ రావు చెప్పారు. ‘ఆత్మాభిమానం ఉన్న ఓ అబ్బాయి కథ ఇది. ప్రేక్షకుడు తనని తాను హీరోగా చూసుకునే కథ’ అని దర్శకుడు శశిధర్‌ చావలి అన్నారు.