సరికొత్త సైంటిఫిక్‌ మిస్టరీ థ్రిల్లర్‌

హెచ్‌ ఎమ్‌ మూవీ మేకర్స్‌ పతాకం పై రవి శంకర్‌, జెడి ఆకాష్‌, సయెద్‌ ఇర్ఫాన్‌, సుమితా బజాజ్‌, సహర్‌ అఫ్సహ, వీరు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కరాళ’. హెచ్‌ ఎమ్‌ శ్రీనందన్‌ దర్శకత్వంలో బోదాసు నర్సింహా నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం కన్నడంలో ‘బీగా’ పేరుతో విడుదల కానుంది. ఈ చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ను పాత్రికేయుల సమావేశంలో మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత బోదాసు నర్సింహా మాట్లాడుతూ, ‘దర్శకుడు చెప్పిన కథ ఈ సినిమా నిర్మించా. మా చిత్రం చాలా గొప్పగా వచ్చింది. తెలుగు, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నాం. ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది’ అని తెలిపారు. ‘సినిమా చూశాను. చాలా కొత్తగా, మంచి సస్పెన్స్‌తో ఉంటుంది’ అని సహ నిర్మాత పిట్ల భాస్కర్‌ అన్నారు. దర్శకుడు శ్రీనందన్‌ మాట్లాడుతూ, ‘ఇదొక సైంటిఫిక్‌ మిస్టరీ చిత్రం. చాలా ఆసక్తికరంగా మంచి ట్విస్ట్స్‌తో, మంచి సంగీతంతో, మంచి యాక్షన్‌ సన్నివేశాలతో సరికొత్తగా ఉంటుంది. కన్నడలో ‘బీగా’ పేరుతో ఈనెల 3న విడుదల చేస్తున్నాం. తెలుగులో త్వరలోనే విడుదల చేస్తున్నాం’ అని అన్నారు.