సాయిప్రణీత్‌ ఓటమి

– థాయ్‌లాండ్‌ మాస్టర్స్‌ టోర్నీ
బ్యాంకాక్‌ : థాయ్‌లాండ్‌ మాస్టర్స్‌ టోర్నీలో భారత పోరాటం ముగిసింది. డబ్ల్యూబిఎఫ్‌ 300 టోర్నీకి భారత స్టార్‌ షట్లర్లు దూరంగా ఉన్నారు. పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్న బి. సాయిప్రణీత్‌ టైటిల్‌పై ఆశలు రేపినా.. చివరకు నిరాశే మిగిల్చాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫూనల్లో చైనా షట్లర్‌ చేతిలో మూడు గేముల మ్యాచ్‌లో పరాజయం చెందాడు. ఆరో సీడ్‌ లి షి ఫెంగ్‌ 21-17, 21-23, 21-18తో సాయిప్రణీత్‌పై పైచేయి సాధించాడు. తొలి గేమ్‌ కోల్పోయిన సాయిప్రణీత్‌.. టైబ్రేకర్‌లో రెండో గేమ్‌ను గెల్చుకున్నాడు. మ్యాచ్‌ను నిర్ణయాత్మక గేమ్‌కు తీసుకెళ్లాడు. కీలక గేమ్‌లో చివరి వరకు పోరాడిన సాయిప్రణీత్‌ చైనా షట్లర్‌కు సెమీఫైనల్‌ బెర్త్‌ కోల్పోయాడు. సాయిప్రణీత్‌ ఓటమితో థారులాండ్‌ మాస్టర్స్‌లో భారత పోరాటానికి తెరపడింది.