సిఎ ఇంటర్మీడియట్‌కు 650 మంది అర్హత

– అన్‌అకాడమీ వెల్లడి
హైదరాబాద్‌ : నవంబరులో నిర్వహించిన సిఎ ఇంటర్మీడియట్‌ 2022 పరీక్షల్లో తమ విద్యార్థులు దాదాపు 650 మందికి పైగా అర్హత సాధించారని లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అన్‌అకాడమీ తెలిపింది. అందులో నలుగురు అభ్యర్థులు 50 లోపు టాప్‌ ర్యాంకులు సాధించారని ప్రకటించింది. టాప్‌ ర్యాంకర్లలో అక్షరు అగర్వాల్‌ (26వ ర్యాంక్‌), శివాంశ్‌ మిట్టల్‌ (38), అన్ష్‌ మార్కండేరు (42), గౌతమ్‌ చౌదరి (45) ఉన్నారని పేర్కొంది. వీరితోపాటు 180 మంది అభ్యర్థులు సిఎ ఇంటర్మీడియట్‌ రెండు గ్రూపులలో అర్హత సాధించారని పేర్కొంది.