సీఎం కేసీఆర్‌కు, మంత్రి హరీశ్‌ రావుకు కృతజ్ఞతలు

– డాక్టర్‌ మార్త రమేశ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రతి సామాన్యునికి వైద్యం చేరువయ్యేలా సంకల్పించి, ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా బడ్జెట్‌ లో వైద్యానికి పెద్ద పీట వేసిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌కు, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌ రావుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, నిమ్స్‌ అనుసంధానాధికారి డాక్టర్‌ మార్త రమేశ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పేదల ఆరోగ్య ప్రదాయినిగా ఉన్న ఆ సంస్థ రూ.290 కోట్లు కేటాయించడం చారిత్రక నిర్ణయంగా అభివర్ణించారు. దీంతో నిమ్స్‌ మరింత పురోగమిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.