సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలి

నవతెలంగాణ-కంటోన్మెంట్‌
ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఓల్డ్‌ బోయిన్‌పల్లి 119వ డివిజన్‌ కార్పొరేటర్‌ ముద్దం నరసింహ యాదవ్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శనివారం డివిజన్‌లో బీఆర్‌ఎస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్‌ మాట్లాడుతూ ఈనెల 17వ తేదీన సీఎం జన్మదిన ఉంటుందని తెలిపారు. డివిజన్‌ లోని వివిధ బస్తీల్లో శంకుస్థాపన చేసిన పనులను పూర్తి చేశామని తెలిపారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ సహకారంతో ఓల్డ్‌ బోయిన్‌పల్లి డివిజన్‌ను మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మెన్‌ నరేందర్‌ గౌడ్‌, మాజీ కౌన్సిలర్లు కర్రే లావణ్య, మక్కల నర్సింగ్‌రావు, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు కర్రె జంగయ్య, బీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షులు ఇర్ఫాన్‌ బారు, జనరల్‌ సెక్రెటరీ మేకల హరినాథ్‌, నియోజకవర్గం మైనారిటీ అధ్యక్షులు సయ్యద్‌ ఇజాజు బారు, వార్డు మెంబర్‌ గడ్డం నర్సింగ్‌ రావు, డివిజన్‌ ఎస్సీ సెల్‌ ప్రెసిడెంట్‌ బుర్రి యాదగిరి, బీసీ సెల్‌ ప్రెసిడెంట్‌ మట్టి శ్రీనివాస్‌, మైనారిటీ ప్రెసిడెంట్‌ జాంగిర్‌ భారు, మహిళా నాయకురాలు లలిత పాల్గొన్నారు.