నవతెలంగాణ-శామీర్‌పేట
మూడు చింతలపల్లి మండలం, కేశవాపూర్ గ్రామ సర్పంచ్ బుడిగే ఇస్తారి మంగళవారం మంత్రి మల్లారెడ్డి ని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి గ్రామాభివద్ధికి నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి గ్రామములోని వైకుంఠ దామం వరకు సిసి రోడ్డు నిర్మాణానికి 10 లక్షల రూపాయలు అలాగే అంతర్గత సిసి రోడ్ల నిర్మాణమునకు పది లక్షల రూపాయలు మొత్తం 20 లక్షల రూపాయల నిధులు పంచాయతీరాజ్ ఫండ్ మంజూరు చేశారు. గ్రామం అభివద్ధికి సహకరిస్తున్న మంత్రికి గ్రామ ప్రజల తరపున గ్రామ సర్పంచ్ బుడిగే ఇస్తారి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐలాపురం రామ్ రెడ్డి, తిమ్మాపురం ఉపేందర్ గౌడ్, గతదితరులు పాల్గొన్నారు.