నవతెలంగాణ – కామారెడ్డి
జిల్లాలోని రైస్ మిల్లుల యజమానులు నిర్ణీత గడువు సెప్టెంబర్ 30, 2024లోగా బియ్యం సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్ లో పౌరసరఫరాల అధికారులతో బియ్యం సరఫరా ఖరీఫ్ 2023 – 2024 సంబంధించి రైస్ మిల్లు యజమానులు పెట్టవలసిన దాన్యం సరఫరా వేగవంతం పై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తమ పరిధిలోని రైస్ మిల్లులు తనిఖీ చేసి బియ్యం ఎఫ్ సి. ఐ. పౌరసరఫరాల శాఖ కు సరఫరా చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రాజేందర్, జిల్లా పౌరసరఫరాల సహాయ అధికారి కే వై ఎల్ నరసింహారావు, టాస్క్ ఫోర్స్ ఉప తాసిల్దార్లు, అధికారులు పాల్గొన్నారు.