స్పర్శ కుష్టు వ్యాధి అవగాహన కార్యక్రమం

– డిప్యూటీ డిఎంహెచ్వో క్రాంతి కుమార్
– అవగాహన కల్పిస్తున్న వైద్య సిబ్బంది
నవతెలంగాణ – తాడ్వాయి
మండలంలోని కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ని రంగాపూర్ గ్రామం లో స్థానిక సర్పంచ్ ఇర్ప అశ్విని సూర్యనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం కుష్టు వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. డిపిఎంఓ సంజీవరావు, వైద్యాధికారులు  డాక్టర్‌ రంజిత్ ఆధ్వర్యంలో స్పర్శ్ కుష్టు వ్యాధి అవగాహనా కార్యక్రమంలో భాగంగా కుష్టు వ్యాధి నియంత్రణ గురించి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  ఇది మైకోబాక్టీరియం లెప్రే వల్ల వస్తుందని, దీనికి ఎం.డి.టి మందులు ప్రభుత్వ ఆసుపత్రులలో దొరుకుతాయని తెలిపారు. కుష్ఠు రోగులను ప్రేమతో,ఆప్యాయంగా చూడాలని, వారి పట్ల వివక్ష చూపరాదని తెలిపారు.
కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం
రంగాపురం గ్రామంలో సర్పంచ్ అధ్యక్షతన డిప్యూటీ కంటి వెలుగు కార్యక్రమం కూడా ప్రారంభించారు. 18 సంవత్సరాల దాటిన వారందరికీ  కళ్ళ పరీక్షలు నిర్వహించారు. అవసరాన్ని బట్టి ఉచితంగా కళ్లద్దాలను పంపిణీ చేశారు. మాట్లాడుతూ అన్ని అవయవాలలో కెల్లా కళ్ళు ప్రధానమైన అవయవాలని, కళ్ళను జాగ్రత్తగా చూసుకోవాలి అన్నారు. ప్రభుత్వం కంటి వెలుగు ప్రోగ్రాం ద్వారా కళ్ళు  ఆపరేషన్ కూడా ఉచితంగా నిర్వహిస్తుందని అందరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో, హెచ్ఈవో బల్గూరి సమ్మయ్య, హెల్త్ అసిస్టెంట్లు ముత్తయ్య, అనిల్, ఏఎన్ఎం ఎల్లారేశ్వరి, ఆశాలు రత్నకుమారి, పద్మ, అనిత తదితరులు పాల్గొన్నారు.