హయర్‌ నుంచి కొత్త ఏసీలు

న్యూఢిల్లీ: గృహోపకరణాలు, వినియోగదారుల ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల కంపెనీ హయర్‌ కొత్తగా కినౌచి 5స్టార్‌ హెవీ డ్యూటీ ప్రో ఎయిర్‌ కండీషనర్‌ సిరీస్‌ను ఆవిష్కరించినట్టు ప్రకటించింది. ఈ సిరీస్‌ ఏసీలు సూపర్‌ కూలింగ్‌ ఫీచర్‌తో శక్తిమంతమైన పనితీరును అం దిస్తాయని పేర్కొంది. ఇవి 65 శాతం శక్తిని పొదుపు చేస్తాయని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అమ్మ కాల్లో రెండంకెల వృద్థిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలి పింది. హయర్‌ రూ.14990 విలువైన 5 సంవత్స రాల వారంటీ, రూ.4000 వరకు క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌లు, రూ.1500 విలువైన ఉచిత ఇన్‌స్టాలేషన్‌, జీవితకాల కంప్రెసర్‌ వారంటీ ఉందని పేర్కొంది. హయర్‌ కినౌచి హెవీ డ్యూటీ ప్రో 5 స్టార్‌ ఎయిర్‌ కండీషనర్‌ ప్రారంభ ధరను రూ.47,990గా నిర్ణయించినట్టు వెల్లడించింది