తెలంగాణ యూనివర్సిటీ హిందీ విభాగం లో పరిశోధక విద్యార్థి ప్రకాష్ కు (రిటైడ్) అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి.ప్రవీణాబాయి గారి పర్యవేక్షణలో ”శతృఘ్న కుమార్ కే సాహిత్య మే బహుజన చేతనా కావిశ్లేషణాత్మక్ అధ్యాయన్ ” అనే అంశంపై పరిశోధన జరిపారు. గురువారం జరిగిన బహిరంగ మౌఖిక పరీక్షకు ఎక్స్టర్నల్ ఎగ్జామినల్ గా ప్రొఫెసర్. శ్యామ్ రావు రాథోడ్ ఇంగ్లీష్ అండ్ పారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ హైదరాబాద్ నుండి హాజరై పరిశోధన సిద్ధాంత గ్రంథం పై విస్తృతమైన సమీక్ష చేశారు. పరిశోధకుడు ప్రకాష్ ఎక్స్టర్నల్ ఎగ్జామినేర్ అడిగిన అన్ని ప్రశ్నలకు ప్రయోగాత్మకమైన ఉదాహరణలతో సమాధానాలు ఇచ్చినారు. బహుజన సమాజంలో సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరం గా, ఆర్థికంగా వెనకబడిన వాళ్లకు చైతన్యం రావడం కోసం చేసే పోరాటం సవివరంగా సిద్ధాంత గ్రంథంలో చర్చించినారు. పరిశోధక విద్యార్థి ప్రకాష్ బహిరంగ మౌఖిక పరీక్షకు హాజరైన ప్రొఫెసర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడంతో విశ్వవిద్యాలయ అధికారులు సంతృప్తి వ్యక్తం చేసి పీహెచ్డీ డిగ్రీకి ఆమోదం తెలిపారు.ఈ బహిరంగ మౌఖిక పరీక్షకు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ ఆరతి, పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్ డాక్టర్ ఎం అరుణ, కళల పీఠాధిపతి ప్రొఫెసర్ లావణ్య, హిందీ విభాగ అధిపతి డాక్టర్ ఎండి జమీల్ హైమద్, డాక్టర్ పార్వతి, డాక్టర్ మొహమ్మద్ అబ్దుల్ ఖావి,డాక్టర్ గుల్ ఈ రానా,డాక్టర్ నాగరాజు, కాంట్రాక్ట్ అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.