హిందూత్వతో గిరిజనుల ఉనికి ప్రశ్నార్థకం

–  అధికారంతో బీజేపీ మభ్యపెడుతున్నది
–  ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ జాతీయ నేత బృందాకరత్‌
– ముడావత్‌ బిక్షానాయక్‌ నగర్‌ నుంచి బి.బసవపున్నయ్య
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ గిరిజన తెగల మధ్య తగ వులు, తెంపులు పెడుతూ వారి ఉనికిని ప్రశ్నా ర్థకం చేస్తున్నాయని ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ జాతీయ నేత, సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకారత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్రమత్తంగా ఉండటం ద్వారా మతోన్మాద ప్రమాదాన్ని ఎదుర్కోవాలని సూచించారు. గిరి జన పరిస్థితులను అధ్యయనం కోసం ప్రత్యేకంగా ఒక సర్వేను నిర్వహించాలనీ, తద్వారా సమస్యల ను గుర్తించి పోరాటాల రూపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రధానంగా విద్యారంగంలో ఈ తరహా సర్వే అవసరమని వ్యాఖ్యానించారు. తమ రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవడం కోసం లక్షలాది మంది గిరిజనులను ఫణంగా పెట్టేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు సిద్ధమయ్యా యని విమర్శించారు. గురువారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో తెలంగాణ గిరిజన సంఘం (టీజీఎస్‌) మూడో రాష్ట్ర మహాసభల ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. గిరిజనుల రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులపై ప్రస్తుతం విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యం లో, వారి ప్రయోజనాలను దెబ్బతీసేందుకు కేంద్రంలోని మోడీ సర్కారు, ఆర్‌ఎస్‌ఎస్‌ కుతం త్రాలకు పాల్పడుతున్నాయని నిరసన వ్యక్తం చేశారు. గిరిజనులపై తప్పుడు కేసులు, లాఠీ ఛార్జీలు, దోపీడీ,దాడుల ద్వారా భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని విమర్శించారు. గిరిజన సంఘం పోరాటాలు, త్యాగాలతో నిర్మిస్తున్నారనీ, ఆ ప్రయత్నం కొనసాగించాలని సూచించారు.
రాజకీయాలకు అతీతంగా పోరాటం
ట్రైకార్‌ చైర్మెన్‌ రాంచందర్‌నాయక్‌
రాజకీయాలకు అతీతంగా పోరాడటం ద్వారానే గిరిజనులపై వివక్ష, దోపిడిని ఎదుర్కోవాలని తెలంగాణ రాష్ట్ర ట్రైకార్‌ చైర్మెన్‌ ఈ. రాంచందర్‌నాయక్‌ పిలుపునిచ్చారు. భూమి గిరిజనుల ఆయుధమనీ, దానినే నమ్ముకుని బతుకుతున్నారని చెప్పారు. నేడు కారల్‌మార్క్స్‌, ఎంగెల్స్‌, అంబేద్కర్‌ ఫోటోలతోపాటు కుమ్రం భీమ్‌, బీర్సా ముండా, సేవాలాల్‌ మహారాజ్‌ ఫోటోలను కూడా పెడుతున్నారని చెప్పారు. దశాద్దకాలంపాటు వామపక్ష విద్యార్థి రాజకీయా ల్లో పనిచేశానని చెప్పారు. పోడుభూములపై గిరిజనసంఘం చేస్తున్న ఉద్యమాలను అభినంది స్తున్నట్టు చెప్పారు.
దళితులు, గిరిజనులు ఐక్యం గా ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పుణ్యమేనని చెప్పారు. అట్టడుగున ఉన్న గిరిజన సమస్యలపై తెలంగాణ గిరిజన సంఘం పనిచేయడం సంతో షమని వ్యాఖ్యానించారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని కోరారు. కష్టపడిపనిచేస్తే ఫలితాలు వస్తామని చెప్పారు.
సమస్యలు ఒకేలా ఉన్నాయి
ఆదివాసీ అధికార్‌ రాష్ట్రయ మంచ్‌ జాతీయ నాయకులు గురుశాంత్‌
కర్నాటకతోపాటు తెలంగాణలోనూ గిరిజను ల సమస్యలు ఒకేలా ఉన్నాయని ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ జాతీయ నాయకులు గురుశాంత్‌ అన్నారు. మేము సైతం పోరాటాలు చేయగలమని, ఈ మహాసభ విశ్వాసాన్ని కల్పిస్తున్నదన్నారు. సోదర రాష్ట్రాలు మనవనీ, కలిసి ఉద్యమ ప్రణాళిక చేద్దామన్నారు. కర్నాటక గిరిజనుల్లో అనేక తెగలు ఉన్నాయని చెప్పారు. ఎస్టీ సబ్‌ప్లాన్‌ను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. అటవీహక్కుల అమలుకోసం నిరంతం ఉద్యమాలు అవసరమని వ్యాఖ్యానించారు. మేము గిరిజన సమస్యలపై రెండు లక్షలకుపైగా దరఖాస్తులు పెడితే, తొమ్మిది వేలు మాత్రమే పరిష్కారమయ్యాయని గుర్తు చేశారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు రాజకీయ అధికారాన్ని వాడుకోవడం ద్వారా గిరిజనులను మభ్యపెడుతున్నాయని చెప్పారు. పూజలు, భజనల ద్వారా గిరిజనులను మోసం చేస్తున్నాయని గుర్తు చేశారు.