హిందూ శ్మశానవాటికలో మౌలిక సదుపాయాలు కల్పించాలి

–  సీపీఐ(ఎం) కూకట్‌పల్లి మండల కార్యదర్శి ఎం.శంకర్‌
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ :
హైదర్‌నగర్‌ బస్తీలోని హిందూ శ్మశానవాటికలో మౌలిక సదుపాయాలు కల్పించి అభివద్ధి చేయాలని సీపీఐ(ఎం) కూకట్‌పల్లి మండల కార్యదర్శి ఎం శంకర్‌ అన్నారు. మంగళవారం కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ మమతను సీపీఐ(ఎం) నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ శ్మశానవాటికలో అంతర్గత రోడ్లు, బై పోల్‌ స్తంభాలు, విద్యుత్‌ లైట్లు , స్నానాల గదులు , శ్మశానవాటిక చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని, బర్నింగ్‌ స్లాబ్స్‌ రెండు, సిమెంట్‌ బల్లలు ఏర్పాటు చేసి వైకుంఠధామం వాహనంలు రెండు ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో స్పందించిన జోనల్‌ కమిషనర్‌ మమత హిందూ శ్మశానవాటికలో మౌలిక సదుపాయాలు కల్పించి అభివద్ధి చేస్తామని హామీ ఇచ్చారు వారికి సీపీఐ(ఎం) నాయకులు కతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బి శ్రీను, డి మహేష్‌ గౌడ్‌ , సాదా మహేష్‌ , అశోక్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు