హెచ్‌సీడీసీ ఆధ్వర్యంలో క్యాంపస్‌ డ్రైవ్‌

నవతెలంగాణ-ఓయూ: ఉస్మానియా విశ్వవిద్యాలయం హ్యూమన్‌ క్యాపిటల్‌ డెవలప్మెంట్‌ సెంటర్‌ వారి ఆధ్వర్యంలో శనివారం కార్యా లయంలో సింజిన్‌ ఇంటర్నేషనల్‌ హైదరాబాద్‌, బెంగళూర్‌ వారు క్యాంపస్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో 200 మంది ఓయూ దాని అనుబంధ కళాశాలాల విద్యా ర్థులు, నిరుద్యోగులు పాల్గొన్నారు. ఈ డ్రైవ్‌లో హెచ్‌ఆర్‌ టీమ్‌ వారు వారి కంపెనీ దాని విధి విధానాలు, సౌకర్యా లు, వేతనాలు, అర్హతల గురించి వివరించారు. విద్యారు ్థలు డ్రైవ్‌లో బాగంగా రాత పరీక్షతో పాటు టెక్నీకల్‌, హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూలు నిర్వహించారు. షార్ట్‌ అయిన వారిని నేరుగా సమాచారాన్ని చేరవేస్తామని డెరైక్టర్‌ ప్రొ.కె.స్టీవెన్‌ సన్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ డెరై క్టర్స్‌ ప్రొ.ఫ్యాట్రిక్‌, ప్రొ.పి.మురళీధర్‌రెడ్డి, సింజిన్‌ ఇంటర్నే షనల్‌ హెచ్‌ఆర్‌ ప్రతినిధులు పూజ, జరుదేవ్‌, ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.