హైదరాబాద్‌ నుంచి 150 డైలీ డిపార్చర్లు : ఇండిగో

హైదరాబాద్‌: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో హైదరాబాద్‌ విమానాశ్రయం నుంచి ఫిబ్రవరి 01 నుంచి ప్రతీ రోజు 150 పైగా డైలీ డిపార్చర్లను సాధించడంలో మరో మైలురాయిని చేరుకున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఇక్కడి నుంచి దేశీయంగా 49 నగరాలతో పాటు ఢాకా, దోహా దుబారు, షార్జా, రియాద్‌, దమ్మామ్‌, మస్కట్‌, కువైట్‌ సిటీతో సహా అంతర్జాతీయంగా 8 నగరాలకు విమానయాన సేవలను అందిస్తున్నట్లు వెల్లడించింది. హైదరాబాద్‌ విమానాశ్రయంలో ఇండిగో జీరో కార్బన్‌ ఉద్గారాలతో 7 కొత్త ఎలక్ట్రిక్‌ బస్సులను కూడా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపింది. ”ఇండిగో ఇప్పుడు హైదరాబాద్‌ నుంచి 150 డైలీ డిపార్చర్లతో విమానాలను నడుపుతుందని ప్రకటించడానికి మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. రాష్ట్రంలో యాక్సెసిబిలిటీ, టూరిజం మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలనే ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా ఈ విమానాలు హైదరాబాద్‌కు మరియు ఇక్కడి నుంచి బయటి ప్రాంతాలకు వద్ధి చెందుతున్న ప్రయాణ డిమాండ్‌ను తీర్చగలవు.” అని ఇండిగో ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజీవ్‌ రాందాస్‌ పేర్కొన్నారు.