
డిచ్ పల్లి మండల బంజారా భవనానికి 20 లక్షల ప్రొసెడింగ్ పత్రాలను మండల బంజారా కమ్యూనిటీ సభ్యులకు శుక్రవారం రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, జిల్లా యువ నాయకులు, జిల్లా ఒలంపిక్ ఉపాధ్యక్షులు, ధర్పల్లి జడ్పిటిసి బాజిరెడ్డి జగన్మోహన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని కులాలు వర్గాల ప్రజల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని అన్ని వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఐడిసిఎంఎస్ చైర్మన్ సాంబార్ మోహన్, పార్టీ మండల అధ్యక్షులు చింత శ్రీనివాస్ రెడ్డి, మండల బంజారా సంఘం అధ్యక్షులు బాల్ రాం నాయక్, రాంపూర్ సహకార సొసైటీ చైర్మన్ తరచంద్ నాయక్, దాసరి లక్ష్మీ నర్సయ్య, సర్పంచులు సంతోష్ నాయక్, సర్దార్ నాయక్, అంబర్ సింగ్,విఠల్ రావు, తరసింగ్, మోహన్ నాయక్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.