హత్యహత్నం కేసులో 06 గురు రిమాండ్ కు తరలింపు 

– సి.ఐ శశిధర్ రెడ్డి 
నవతెలంగాణ-వీర్నపల్లి : వీర్నపల్లి మండలం ఎర్రగడ్డ తండ గ్రామనికి చెందిన బానోత్ బింజీ నాయక్ తండ్రి వల్య నాయక్ అనే వ్యక్తి తనయెక్క భూమిలో సోమవారం మధ్యాహ్నం 01:30 గంటలకు బానోత్ బింజీ నాయక్ కొడుకు బానోత్ చంద్రకాంత్ నాయక్ లు ట్రాక్టర్ తో సాగు చేస్తుండగా అదే గ్రామానికి చెందిన కొంతమంది వారిద్దరిపై కర్రలతో దాడి చేసారని ఫిర్యాదు పై , హత్య ప్రయత్నంకి పాల్పడిన వ్యక్తులైన ఎర్రగడ్డ తండా గ్రామానికి చెందిన, 1)బానోత్ శ్రీనివాస్ 2)బానోత్ మదన్, మధు 3) బానోత్ నరేష్ 4)మాలోతు శ్రీనివాస్ 5)బానోతు సుధాకర్ 6)బానోత్ కెమ్య అను వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని సి ఐ శశిధర్ రెడ్డి తెలిపారు. భీంజి నాయక్ , బానోతు శ్రీనివాస్ లకు గత కొద్ది కాలంగ గొడవలు ఈ భూమి విషయంలో జరుగుతున్నాయి . గొడవ జరుగుతున్నప్పుడు వారు 100 డయల్ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్ళగా పై నిందితులు పోలీసు వారితో దురుసుగా ప్రవర్తించి విధులకు ఆటంకం కలిగించినందుకు కూడా వారిపై సెక్షన్ 353 IPC కింద కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ నవత, కానిస్టేబుల్ ఉన్నారు.