– 22 వరకు దరఖాస్తుల సవరణకు గడువు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు రాష్ట్రవ్యాప్తంగా 1,26,052 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఈ మేరకు టెట్ కన్వీనర్ రమేష్, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, టెట్ చైర్మెన్ ఈవి నరసింహారెడ్డి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. టెట్ పేపర్-1కు 39,714 మంది, పేపర్-2కు 75,712 మంది, రెండింటికీ 10,599 మంది కలిపి మొత్తం 1,26,052 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని వివరించారు. టెట్ దరఖాస్తుల సమర్పణకు తుది గడువు ఈనెల 20 వరకు ఉన్న విషయం తెలిసిందే. టెట్‌కు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించామని తెలిపారు. ఈనెల 22 వరకు సవరణకు గడువుందని పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 7032901383/9000756178 నెంబర్లను సంప్రదించాలి.