రిలయన్స్‌ లాభాల్లో 10.8% పతనం

న్యూఢిల్లీ : ముకేష్‌ అంబానికి చెందిన రిలయన్స్‌ ఇండిస్టీస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో 10.8 శాతం పతనంతో రూ.16,011 కోట్ల లాభాలు నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.17,955 కోట్ల లాభాలు సాధించింది. క్రితం క్యూ1 లో కంపెనీ రెవెన్యూ 5.3 శాతం తగ్గి రూ.2.11 లక్షల కోట్లకు పరి మితమయ్యింది. రిలయన్స్‌ రిటైల్‌ లాభాలు 18.8 శాతం పెరిగి రూ.2,448 కోట్లుగా నమోదయ్యాయి. రిలయన్స్‌ జియో ఇన్ఫోకమ్‌ లాభాలు 12.2 శాతం పెరిగి రూ.4,863 కోట్లుగా చోటు చేసుకున్నాయి. శుక్రవారం బిఎస్‌ఇలో రిలయన్స్‌ షేర్‌ 2.57 శాతం పతనమై రూ.2536.20 వద్ద ముగిసింది.