రోడ్ల అభివృద్ధికి రూ.10 కోట్ల 25 లక్షలు మంజూరు

– ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే
నవతెలంగాణ-షాద్‌ నగర్‌
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తండాల అభివృద్ధిని ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలనే సంకల్పంతో ఎన్నో పనులు చేపడుతుంది. అందులో భాగంగానే షాద్‌ నగర్‌ నియోజకవర్గ పరిధిలోని తండాల అభివృద్ధి కోసం రోడ్ల మరమ్మత్తులకు రూ. 10 కోట్ల 25 లక్షల రూపాయాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలోని దర్గా రోడ్డు నుంచి కోల్‌ బాయి తండా, మేకగూడ గ్రామం రూ.1.60 కోట్లు, ఫరూఖ్‌నగర్‌ మండలం వెలిజర్ల నుంచి జీడిగడ్డ తండా రూ. 1.20 కోట్లు, చింతగట్టు తండా నుండి పొల్కొనిగుట్ట తండా రూ. 1.20 కోట్లు, ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి బలిజరాల తండా, వేములనర్వ గ్రామం రూ. 65 లక్షలు, పి.ఆర్‌ రోడ్డు నుంచి నాను తండా వయా బాల్య తండా, తొమ్మిది రేకుల గ్రామం రూ. 2 కోట్లు, జడ్పీ రోడ్డు నుంచి పిట్టలగడ్డ తండా, కండివనం గ్రామం రూ. 70 లక్షలు. పి.ఆర్‌ రోడ్డు నుంచి ధర్మ్యా తండా, మేకగూడ గ్రామం రూ. 30 లక్షలు. పి.ఆర్‌ రోడ్డు నుంచి చీలం బాయి తండా, ఆయోధ్యపూర్‌ తండా రూ. 1.50 కోట్లు, ఎం.ఎస్‌.ఎన్‌ ఫార్మ నుంచి పెద్దకుంట తండా, నందిగామ గ్రామం రూ. 40 లక్షలు.జాకారం జడ్పీ రోడ్డు నుంచి వేపకుచ్చ తండా, చింతకుంట తండా గ్రామం రూ. 70 లక్షలు ప్రభుత్వం నుంచి మంజూరైనట్టు ఎమ్మెల్యే తెలిపారు.