డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకరికి పది రోజులు జైలు శిక్ష

నవతెలంగాణ –  కంటేశ్వర్

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో ఒకరికి పది రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి సయ్యద్‌ ఖదీర్‌ బుధవారం తీర్పు వెలువరించారు. రాజు అనే వ్యక్తి మద్యం తాగి బైకు నడపి పోలీసులకు చిక్కాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో బుధవారం కోర్టులో ప్రవేశపెట్టారు. అతనికి న్యాయమూర్తి పది రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. అలాగే మరో 22 కేసుల్లో రూ.26,500 జరిమానా విధించారు.