యూత్‌ఫుల్ లవ్‌ఎంటర్‌టైనర్స్‌కు ఎప్పుడూ ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. అలాంటి కథా కథనాలతో ‘ 10 ప్రేమకథలు’ సినిమా రాబోతోంది. ఈ చిత్రాన్ని పీసీ క్రియేషన్స్ సమర్పణలో మనూ టైమ్ మూవీ మిషన్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి మనోహర్ చిమ్మని దర్శకత్వం వహించనున్నారు. తాజాగా ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు దర్శకులు వీరశంకర్, చంద్రమహేశ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మూవీ పోస్టర్ పై దర్శకుడు వీరశంకర్ క్లాప్ కొట్టారు. దర్శకుడు మనోహర్ చిమ్మని మాట్లాడుతూ, ‘యో… అనే మాట యువతకు ప్రతీక. ఈతరం యువతీయువకుల ఆలోచనలు, జీవనశైలి చుట్టూ అల్లిన 10 ప్రేమ కథల సమాహారం ఈ సినిమా. ఒక్కో ప్రేమకథ ఒక్కో జోనర్లో ఉంటుంది. అయితే ఈ ప్రేమకథలన్నింటికీ లక్ష్యం ఒక్కటే ఉంటుంది. ఆ లక్ష్యమే ఈ సినిమాను యువతరం ప్రేక్షకులకు కనెక్ట్ చేస్తుంది. ఈ సినిమాలో పది మంది పాపులర్ హీరో, హీరోయిన్లు నటిస్తున్నారు. సపోర్టింగ్ రోల్స్‌లో కూడా పాపులర్ సహనటీనటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్ నటిస్తున్నారు. నవంబర్ చివరివారం నుంచి వైజాగ్, గోవా, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అద్భుతమైన లొకేషన్స్‌లో షూట్ చెయ్యబోతున్నాం. ఈ ప్రారంభ వేడుకలో ప్రదర్శించిన ఇంట్రో వీడియో, ఈ చిత్ర పోస్టర్ డిజైనింగ్‌ను ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్‌తో చేశాం. ఈ సినిమాలోని ఇంకా చాలా అంశాల్లో ఏఐని ఉపయోగిస్తున్నాం’ అని తెలిపారు.
10 భిన్న ప్రేమకథలు
10:47 pm